GUNTUR DISTRICT NEWS: ఈనెల 23న ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి శంకుస్థాపన

Karthik

సీఎం చంద్రబాబు ఈ నెల 23వ తేదీన ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్న దృష్ట్యా ఏర్పాట్లను పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ , జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ సోమవారం పరిశీలించారు. తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెంలో ఈ కార్యక్రమం జరగనుంది. వేదిక ఏర్పాటు, పార్కింగ్, ముఖ్య అతిథులు కూర్చునే స్థలాలు, వచ్చే ప్రజానీకం కూర్చునే ఏర్పాట్లు పరిశీలించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి, ఎం.టి.ఎం.సి కమిషనర్ అలీం భాషా, రహదారులు భవనాలు శాఖ పర్యవేక్షక  ఇంజనీర్ శ్రీనివాస్ మూర్తి, డి.ఎస్.పి మురళీ కృష్ణ, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి.రంగా రావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి, జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, జిల్లా పంచాయతీ అధికారి బి.వి.నాగ సాయి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review