GUNTUR DISTRICT NEWS: ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయాలి

Karthik

పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 11000 ఎస్.ఐ, కానిస్టేబుల్ పోస్టులకు పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టాలని మరియు వయోపరిమితి 5 సంవత్సరాలు పెంచాలని – కోరుతూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం ఎంతోకాలంగా లక్షలాది మంది నిరుద్యోగ యువత, అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పోలీస్ శాఖపై పెరుగుతున్న పని భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రస్తుతం 2,050 పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల నియామకాలకు సంబంధించి విడుదల చేసిన నోటిఫికేషన్ పోలీసు శాఖలో ఉన్న ఖాళీలకు మరియు పోలీసు ఉద్యోగానికి సిద్ధం అవుతున్న అభ్యర్థుల సంఖ్యకు ఏమాత్రం పొంతనలేనిదిగా ఉన్నది. ఇది ఇప్పటికే పోలీసు ఉద్యోగల కోసం సంవత్సరాలు తరబడి శిక్షణ తీసుకొంటు ప్రవేశ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగినేచేదిగా ఉన్నదని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) భావిస్తున్నాము. కావున పూర్తి స్థాయిలో ఖాళీలను భర్తీ చేసేందుకుగాను ఇప్పుడు విడుదల చేసిన 2,050 పోస్టుల నోటిఫికేషన్ రద్దు చేసి తక్షణమే పూర్తి స్థాయి నియామకాలు చేసేందుకు 11,000 పోస్టులకు సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలకు సిద్ధం అవుతున్న వేలాది మంది అభ్యర్థులకు న్యాయం చేయాలని అంతేకాకుండా రాష్ట్రంలో పోలీసు శాఖలో ఎన్నో ఏళ్లుగా నియకాలు లేకపోవడం వలన అనేక వేల మంది అభ్యర్థుల వయోపరిమితి దాటిపోతున్న కారణంగా పోలీసు ఉద్యోగానికి అర్హత కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారందరికి న్యాయం చేసేందుకు మానవతా దృక్పధంతో వన్ టైం మేజర్ క్రింద 5 సంవత్సరాల వయోపరిమితి పెంచాలని ఏఐవైఎఫ్ నేతలు డిమాండ్ చేశారు.

Author
Share This Article
Leave a review