బాపట్ల:– బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని న్యూ వీసీ హాల్లో జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు.Bapatla City News
సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్తో కలిసి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొన్నారు.

జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి, వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు అవసరమైన సేవలను సమర్థవంతంగా అందించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అంశాలపై సమీక్ష సాగింది.Bapatla City news
ఈ సమావేశంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, చీరాల ఎమ్మెల్యే ముద్దులూరి మాలకొండయ్య, జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఎమ్మెల్సీలు టి. మాధవరావు, పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు.



