Hyderabad City news : కుటుంబ సమేతంగా ఖైరతాబాద్ బడా గణేశుడిని దర్శించుకున్న హైదరాబాద్ సీపీ-శాంతియుత వాతావరణంలో గణేష్ శోభాయాత్రకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి

Sharat
1 View

హైదరాబాద్:- ఖైరతాబాద్ బడా గణేశుడిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన శ్రీ మహాగణపతి వద్దకు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్న సీపీకి గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు, వేద పండితులు స్వాగతం పలికారు. అనంతరం సీపీ కుటుంబ సభ్యులతో కలిసి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళహారతి సమర్పించారు.

ఈ సందర్భంగా వీసీ సజ్జనార్ మాట్లాడుతూ నగర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరం శాంతిభద్రతలతో ప్రశాంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.Hyderabad City News

దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఖైరతాబాద్ బడా గణేశుడిని ఇప్పటివరకు సుమారు 25 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు సీపీ తెలిపారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఉండదని పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించే గణేష్ శోభాయాత్ర సందర్భంగా భక్తులు దర్శించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

గణేష్ శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ వీసీ సజ్జనార్ కోరారు.

Author
Share This Article
Leave a review