Hyderabad City News :దళిత అసైన్డ్ భూములకు పూర్తి హక్కులివ్వాలి-తెలంగాణ భూ రక్షణ సమితి డిమాండ్

Sharat
1 View

హైదరాబాద్ :రాష్ట్రంలోని పేద ప్రజలకు గతంలో కేటాయించిన అసైన్డ్ భూములకు వెంటనే పూర్తి యాజమాన్య హక్కులు కల్పించి, శాశ్వత పట్టాలు జారీ చేయాలని తెలంగాణ భూ రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుగ్గ మైసయ్య డిమాండ్ చేశారు.

మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు రాపోలు రాములు, చింత స్వామిలతో కలిసి ఆయన మాట్లాడారు.#KarumuriNageswaraRao #SITRaids #AndhraPradeshNews #YCP #LiquorScam #Hyderabad #JubileeHills #APPolitics #Vijayawada #BreakingNews

ముఖ్యమైన పాయింట్లు:

  • గత ప్రభుత్వంపై విమర్శలు: కేజీ టు పీజీ ఉచిత విద్య, మూడెకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి వంటి హామీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. అంతేకాకుండా ధరణి, రైతు వేదికలు, స్మశానవాటికలు, ప్రభుత్వ కార్యాలయాల పేరుతో దళితుల భూములను గుంజుకుందని మండిపడ్డారు.
  • చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలి: కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను దళితులు 40-50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారని, వారికి ఇంకా పూర్తి హక్కులు దక్కకపోవడం శోచనీయమన్నారు. ఎన్నికల మేనిఫెస్టో, చేవెళ్ల ‘దళిత డిక్లరేషన్’లలో ఇచ్చిన హామీ ప్రకారం అసైన్డ్ భూములపై అమ్ముకునే హక్కుతో సహా సమగ్ర యాజమాన్య హక్కులు కల్పించాలని కోరారు.
  • అసెంబ్లీలోనే చట్టబద్ధ నిర్ణయం తీసుకోవాలి: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్టర్లు, భూస్వాముల దౌర్జన్యాల నుంచి దళితుల భూములను కాపాడాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అసైన్డ్ భూములను ‘సెక్షన్ 22ఏ’ నిషేధిత జాబితా నుంచి తొలగించి చట్టబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
Author
Share This Article
Leave a review