హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద నవరాత్రి బాష్‌గా నిర్వహించనున్న ‘కంట్రీ క్లబ్ నవరాత్రి బాష్ 2026’ వేడుకలకు శ్రీకారం చుట్టారు. బేగంపేటలోని కంట్రీ క్లబ్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో నవరాత్రి వేడుకల సన్నాహక పోస్టర్‌ను కంట్రీ క్లబ్ చైర్మన్ రాజీవ్ రెడ్డి, మాజీ మిస్ ఇండియా సిమ్రన్ అహూజా, హిందీ బిగ్‌బాస్ ఫేమ్ హేమ శర్మ, తెలుగు బిగ్‌బాస్ ఫేమ్ ఇనాయా సుల్తానా, మిస్ యూనివర్స్ తెలంగాణ హసిత నారాయణభట్ట కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గర్బా, డాండియా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. గర్బా, డాండియా, సంగీతం, పండుగ సంబరాలతో నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 2030 నాటికి 10 లక్షల మంది సభ్యులతో కూడిన కమ్యూనిటీని నిర్మించడమే లక్ష్యంగా కంట్రీ క్లబ్ ముందుకు సాగుతోందన్నారు. సంప్రదాయ నవరాత్రి స్ఫూర్తిని గర్బా, డాండియా, సంగీతం, వినోదంతో మేళవించి ఆధునిక వేడుకల అనుభూతిని అందించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కంట్రీ క్లబ్లలోనూ నవరాత్రి వేడుకలను నిర్వహిస్తున్నట్లు వివరించారు.GoldPriceHyderabad
కంట్రీ క్లబ్ వృద్ధి వ్యూహాన్ని కూడా రాజీవ్ రెడ్డి వెల్లడించారు. సభ్యత్వ విలువను మరింత బలోపేతం చేయడంతో పాటు లైఫ్‌స్టైల్, ఫిట్నెస్, హాలిడేస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రంగాలను అనుసంధానం చేస్తూ సభ్యులు, భాగస్వాములు, వ్యాపారవేత్తలకు విస్తృతమైన ఎకోసిస్టమ్‌ను రూపొందించడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
2030 నాటికి 10 లక్షల మంది సభ్యులను చేరుకునే లక్ష్యానికి అనుగుణంగా స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా క్లబ్‌లు, ఫిట్నెస్, హాలిడేస్, వివిధ అనుభవాలను సభ్యులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే ఉన్న సభ్యులతో పాటు కొత్త సభ్యులకు మరింత విలువైన సేవలు అందించేందుకు 500 కొలాబొరేటెడ్ క్లబ్‌లు, 1,000 ఫిట్నెస్ సెంటర్లు, దేశీయ, అంతర్జాతీయంగా 1,000 హాలిడే డెస్టినేషన్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాజీవ్ రెడ్డి వెల్లడించారు.
అదే విధంగా CCIP (కంట్రీ క్లబ్ ఎంటర్ప్రెన్యూర్ ప్రోగ్రామ్)ను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వ్యక్తులు తమ సొంత వ్యాపారాలను నిర్మించుకుని, స్వయం ఉపాధి అవకాశాలను పొందడంతో పాటు కంట్రీ క్లబ్ ఎకోసిస్టమ్‌లో భాగస్వాములుగా వ్యాపార అవకాశాలను అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు.
‘రెల్-ఈవెంట్’ ఎండీ సందీప్ కుమార్ చందా మాట్లాడుతూ.. అక్టోబర్ 11 నుంచి 20 వరకు బేగంపేటలోని విశాలమైన పోలీస్ హాకీ స్టేడియంలో 10 రోజుల పాటు ‘నవరాత్రి ఉత్సవ్ దాండియా నైట్స్’ నిర్వహించనున్నట్లు తెలిపారు. గర్బా, డాండియా, సంగీతం, వినోద కార్యక్రమాలతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.



