నరసరావుపేట: అనారోగ్యంతో వైద్య ఖర్చులు భరించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) అండగా నిలుస్తోందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో CMRF కింద మంజూరైన 72 మంది లబ్ధిదారులకు రూ.63,45,952 విలువైన చెక్కులను ఆదివారం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పంపిణీ చేశారు. అలాగే అత్యవసర వైద్య చికిత్స అవసరమైన 16 మందికి రూ.29,39,455 విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) పత్రాలను ఇప్పటికే అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అనారోగ్యం కారణంగా ఒక్కసారిగా కుటుంబాలపై వైద్య ఖర్చుల భారం పడుతోందన్నారు. చికిత్స కోసం అప్పులు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు CMRF ద్వారా అందుతున్న సహాయం ఉపశమనం కలిగిస్తోందని పేర్కొన్నారు.Palnadu distc News
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సకాలంలో సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందనే భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.



