రేపల్లె (బాపట్ల జిల్లా), సెప్టెంబర్ 27: అక్టోబర్ 1వ తేదీ (గురువారం) రేపల్లె పట్టణంలో నిర్వహించనున్న ‘పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేయనున్న ప్రజావేదికతో పాటు హెలీప్యాడ్ నిర్మాణ ప్రాంతాలను ఆదివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన కలెక్టర్… ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. హెలీప్యాడ్ భద్రత, ప్రజావేదిక వద్ద బందోబస్తు, ఆసనాలు, తాగునీరు, విఐపి రూట్ మ్యాప్ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.Bapatla city news

ఈ పరిశీలన కార్యక్రమంలో ఆర్డీఓ బి. శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ బి. సాంబశివరావు, డిఎస్పీ అబ్దుల్ అజీజ్, డిఆర్‌డిఓ పద్మావతిలతో పాటు స్థానిక తహశీల్దార్, ఎంపీడీఓ మరియు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



