GUNTUR DISTRICT NEWS: అక్టోబర్ 1 మధ్యాహ్నం నుండి పింఛన్ల పంపిణీ

Karthik

జిల్లాలో అక్టోబర్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం నుండి జరుగుతుందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా, అక్టోబర్ 1వ తేదీ ఉదయం బ్యాంకుల నుండి నగదు తీసి (విత్ డ్రా), అదే రోజు మధ్యాహ్నం నుండి పంపిణీ చేస్తారన్నారు. అక్టోబర్ 1వ తేదీన పింఛను తీసుకోలేని వారికి అక్టోబర్ 3వ తేదీన అందజేస్తారని చెప్పారు. ఎస్.జీ.ఎస్.డబ్ల్యూ, ఇతర ప్రభుత్వ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. బ్యాంకుల నుండి నగదు పొందడం, సిబ్బందిని మ్యాపింగ్ చేయడం, పంపిణీ సక్రమంగా, సాఫీగా జరుగుటకు సరైన పర్యవేక్షణ, కార్యాచరణ తయారు చేసి సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Author
Share This Article
Leave a review