నిర్దేశిత ప్రభుత్వ నిబంధనలను, ప్రమాణాలను పూర్తిగా పాటించిన బహుళ అంతస్తుల భవనాలకు మాత్రమే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను మంజూరు చేస్తామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు శుక్రవారం కమిషనర్ నగరంలోని బ్రాడీపేట, ఎల్ఐసి కాలనీ, పలకలూరు రోడ్, జేకేసీ కాలేజీ రోడ్, గోరంట్ల, రామిరెడ్డి నగర్, సంతోష్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాల్లో అనుమతించిన ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టారా లేదా అనే విషయాన్ని నిశితంగా పరిశీలించారు. పార్కింగ్ స్థలం, సెట్‌బ్యాక్స్, అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు, వర్షపు నీటి సంరక్షణ గుంతలు తదితర అంశాలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా అని తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన భవనాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు మంజూరు చేయరాదని, అన్ని ప్రమాణాలు పాటించిన భవనాలకు మాత్రమే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు జారీ చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే ప్లానింగ్ కార్యదర్శులు తప్పనిసరిగా తమ సచివాలయం పరిధిలో అనధికార లేదా నిర్దేశిత ప్లాన్ కి భిన్నంగా నిర్మాణాలు జరగకుండా ప్రాధమిక స్థాయిలోనే అడ్డుకోవాలని, లేకుంటే వారితో పాటు పర్యవేక్షణ అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అనంతరం నగరంలోని వివిధ డివిజన్లలో జరుగుతున్న సిసి రోడ్లు, డ్రైన్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులను పరిశీలించి, నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, పనులు పూర్తైన వెంటనే నిర్మాణ వ్యర్ధాలను తొలగించాలని ఆదేశించారు. అభివృద్ధి పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, డ్రెయిన్లలో పూడికతీత పనులను నిరంతరం పర్యవేక్షించాలని ప్రజారోగ్య విభాగ అధికారులను ఆదేశించారు. పర్యటనలో సిటీ ప్లానర్ రాంబాబు, డిసిపి సూరజ్ కుమార్, ఏసిపీ రెహ్మాన్, డిఈఈ రమేష్ బాబు, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
GUNTUR CITY NEWS: భవన నిర్మాణాల్లో నిబంధనలు పాటించని వారిపై చర్యలు

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
40°C
Vijayawada
broken clouds
40° _ 40°
29%
3 km/h
Fri
41 °C
Sat
41 °C
Sun
42 °C


