టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల సంక్షేమ నిధి చెక్కు అందజేత

Karthik

గుంటూరు ఏటి అగ్రహారానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త డి. అంజిరెడ్డి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆయన కుటుంబానికి పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి మంజూరైన రూ.5 లక్షల చెక్కును అంజిరెడ్డి సతీమణి దిట్టుకుంట తులసమ్మకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే & టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని, కార్యకర్తల సంక్షేమం విషయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ఆ దిశగా కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. అనంతరం ఎన్డీయే కూటమి నేతల గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి, కూటమి నాయకులు మరియు కార్యకర్తల నుంచి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా సమస్యలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని గళ్ళా మాధవి పేర్కొన్నారు.

Author
Share This Article
Leave a review