GUNTUR CITY NEWS: ఒక్క మొక్కతో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

Karthik

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొరిటెపాడు వాకింగ్ ట్రాక్‌లో 60 మొక్కలు నాటిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి. ప్రతి ఒక్కరు ఒక్క మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే & టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి శుక్రవారం కొరిటెపాడు వాకింగ్ ట్రాక్‌లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీయే కూటమి నాయకులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొత్తం 60 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు.కొరిటెపాడు వాకింగ్ ట్రాక్‌లో కొత్తగా ఏర్పాటైన కమిటీ అధ్యక్షులు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చైతన్య గ్రామీణ బ్యాంకు సౌజన్యంతో మొక్కలు అందించడం పట్ల బ్యాంకు ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు నాటిన 60 మొక్కలను పూర్తిస్థాయిలో సంరక్షించి, అవి పెద్ద చెట్లుగా ఎదిగే వరకు బాధ్యతగా చూసుకుంటామని హామీ ఇవ్వడం సంతోషకరమన్నారు. వాకింగ్ ట్రాక్‌ను వినియోగించే ప్రజలకు భవిష్యత్తులో ఈ మొక్కలు స్వచ్ఛమైన గాలిని, చల్లని నీడను అందిస్తాయని తెలిపారు.మొక్కలు నాటడం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచించారు. పుట్టినరోజులు, శుభకార్యాలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి కృతజ్ఞతలు తెలిపారు.

Author
Share This Article
Leave a review