గుంటూరులో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న 15 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 లక్షల నగదు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం, పాతగుంటూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో జయరాం నాయక్, షేక్ రియాజ్ అనే ప్రధాన ముద్దాయిలు ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా బెట్టింగ్ కు నిర్వహిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మికంగా దాడులు జరిపి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం మీడియాకు వెల్లడించారు. క్రికెట్ బెట్టింగ్ వల్ల ఆర్ధికంగా నష్టం జరగడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
GUNTUR BREAKING NEWS: క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడిన 15 మంది నిందితుల ముఠా అరెస్ట్

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
36°C
Vijayawada
broken clouds
36° _ 36°
44%
4 km/h
Thu
36 °C
Fri
41 °C
Sat
40 °C


