చిన్నగంజాం:– మండల కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఇందులో భూ సర్వేకు సంబంధించి ఒక అర్జీ వచ్చినట్లు తహసీల్దార్ ప్రభాకర్ తెలిపారు.
సర్వేకు సంబంధించిన సమస్యను పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.Bapatla District City News
చిన్నగంజాం మండల కార్యాలయంలో జరిగిన ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు పాల్గొని ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.



