Bapatla District city news :గురవుకు సన్మానం

S Sarath
1 View

పర్చూరు నియోజకవర్గం/చిన్నగంజాం:-గురువుల రుణ తీర్చుకోవడం కన్నా మించిన మహత్కార్యం మరొకటి లేదని పూర్వ విద్యార్థులు నిరూపించారు. చిన్నతనంలో అక్షరాల నడకలు నేర్పించిన గురువులను దశాబ్దాల తర్వాత కూడా గుర్తుపెట్టుకుని ఘనంగా సన్మానించారు.

బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం, చిన్నగంజాం మండలంలోని మున్నంవారిపాలెం ఎంపీపీ పాఠశాలలో సోమవారం ఒక అపురూప ఘట్టం చోటుచేసుకుంది. ముప్పై సంవత్సరాల క్రితం తమకు విద్యాబుద్ధులు నేర్పించిన పూజనీయులైన గురువులు ఎస్.వెంకటేశ్వరరావు, సీతారావమ్మలను పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా ఆహ్వానించారు.Bapatla City News

ఈ సందర్భంగా గురువులకు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. తమ చిన్నతనంలో జ్ఞానజ్యోతిని వెలిగించి, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అందించిన ఆచార్యుల పాదాలకు భక్తిశ్రద్ధలతో ప్రణామం చేశారు. ఈ వేడుకలో పూర్వ విద్యార్థులు అలనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, స్థానికులు మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review