Eluru District city news :టీ.నర్సాపురం మండలం బొర్రంపాలెంలో తెదేపా కార్యకర్తల సమావేశం కార్యకర్తలే పార్టీకి అసలైన సైనికులు-జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి

S Sarath
1 View

టి.నర్సాపురం (పోలవరం నియోజకవర్గం): ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో సోమవారం తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గ కార్యకర్తల సమన్వయ సమావేశం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర ట్రైకర్ (TRICOR) చైర్మన్ బోరగం శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ… పార్టీ బలానికి, విజేతగా నిలవడానికి నిరంతరం శ్రమించే కార్యకర్తలే అసలైన అండ అని కొనియాడారు. నియోజకవర్గ స్థాయి నాయకులు నిరంతరం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం మంత్రి స్థానిక ప్రజల నుంచి అర్జీలు, వినతులను స్వీకరించారు. సమస్యల తీవ్రతను పరిశీలించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు.Eluru City News

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి 100 శాతం స్థానిక సంస్థల స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని మంత్రి నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన పలువురు కీలక నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review