ఆంధ్రప్రదేశ్ లో రైతులు సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్సంకల్పంతో 175 నియోజవర్గాల్లో వరుణ హోమాలు నిర్వహిస్తున్నామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. మంగళవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్‌లో ఉన్న శ్రీ రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహించిన వరుణ హోమం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం మేరకు దేవాలయాల్లో వరుణ హోమాలు, యాగాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైష్ణవ ఆలయాల్లో వరుణ హోమాలు, హోమాది కార్యక్రమాలు, శైవ ఆలయాల్లో సహస్ర ఘటాభిషేకాలు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నట్లు చెప్పారు.రైతులు సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్సంకల్పంతో ఈ వరుణ హోమం కార్యక్రమాలను చేపట్టారని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా అనేక ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం పరంగా తీసుకుంటున్న చర్యలతో పాటు దైవబలం కూడా ఎంతో అవసరమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు.రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ప్రతి నియోజకవర్గంలోని ప్రధాన దేవాలయాల్లో వరుణ యజ్ఞాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనూ శ్రీ రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో వరుణ హోమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమానికి భక్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయడం సంతోషకరమని, దేవదేవుని ఆశీస్సులతో రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆకాంక్షించారు.



