Guntur City News :కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్‌లో సత్తా చాటిన యువ క్రీడాకారులు-మాదల చైతన్య ఆధ్వర్యంలో రూ.2 లక్షల ఆర్థిక సాయం.. విజేతలకు ఘన సత్కారం

S Sarath
1 View

గుంటూరు:– కామన్వెల్త్ క్లాసిక్ అండ్ ఈక్విప్డ్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్–2026లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించిన యువ క్రీడాకారులను జన చైతన్య గ్రూప్ అధినేత మాదల చైతన్య అభినందించారు. మంగళవారం చంద్రమౌళి నగర్‌లోని ఆయన కార్యాలయంలో విజేతల అభినందన కార్యక్రమం నిర్వహించారు.

47 కిలోల జూనియర్ విభాగంలో మధిర షానన్ వెండి పతకం, 76 కిలోల సబ్‌జూనియర్ విభాగంలో బొల్లు లిఖిత బంగారు పతకం, 95 కిలోల విభాగంలో సంకా కౌశిక్ వెండి పతకం సాధించారు. వీరితో పాటు కోచ్ ఘట్టమనేని సాయి రేవతిని కూడా మాదల చైతన్య అభినందించారు.

ఈ సందర్భంగా మాదల చైతన్య మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాల్సిన అవసరం ఉందన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించవచ్చని పేర్కొన్నారు.

ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు అవసరమైన సమయంలో ఆచరణాత్మకంగా అండగా నిలవడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం నుంచి మరింత మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు.

“పతకాలు సాధించడం ఒక్క విజయం కాదు.. దేశం కోసం పోరాడే స్ఫూర్తిని యువతలో నింపడమే అసలైన విజయం” అని మాదల చైతన్య పేర్కొన్నారు.

క్రీడాకారులు మాట్లాడుతూ తమ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన మాదల చైతన్యకు కృతజ్ఞతలు తెలిపారు. పోటీలకు వెళ్లే సమయంలో అందించిన రూ.2 లక్షల ఆర్థిక సహాయం తమకు ఎంతో ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని దేశానికి మంచి పేరు తీసుకువస్తామని తెలిపారు.Guntur City News

అనంతరం పవర్‌లిఫ్టింగ్ కోచ్ ఘట్టమనేని సాయి రేవతి, క్రీడాకారులు మధిర షానన్, బొల్లు లిఖిత, సంకా కౌశిక్‌లను శాలువాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో క్రీడాభిమానులు వల్లంశెట్టి రమేష్, సి.హెచ్. విజయ్, పొన్నెకంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review