Krishna District City News :పామర్రులో వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్ర విమర్శలు.. వీరాంజనేయ కాలనీ సమస్యలే కారణం

S Sarath
1 View

పామర్రు (కృష్ణా జిల్లా):– పామర్రు నియోజకవర్గ పరిధిలోని వీరాంజనేయ కాలనీ సమస్యలు ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య తీవ్ర రాజకీయ వేడిని రాజేసాయి. స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ వైస్ ఎంపీపీ ఆరేపల్లి శ్రీను మాట్లాడుతూ టీడీపీ నాయకుల వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

గత నాలుగు నెలలుగా వీరాంజనేయ కాలనీవాసులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆరేపల్లి శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, పారిశుధ్యం పూర్తిగా పడకేసిందని మండిపడ్డారు. చివరికి తాగునీటి పైప్‌లైన్లు పగిలిపోయి మురుగునీరు వస్తుండటంతో తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తమను పట్టించుకునే నాథుడే లేడని కాలనీవాసులు ఆహ్వానించడంతోనే మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ స్వయంగా అక్కడ పర్యటించి సమస్యలను పరిశీలించారని స్పష్టం చేశారు.

ప్రజల కష్టాలను చూసి చలించిన మాజీ ఎమ్మెల్యే వెంటనే స్పందించి, సమస్యల పరిష్కారం కోసం పామర్రు పంచాయతీ కార్యదర్శికి, ఎంపీడీవోకి వినతిపత్రం అందజేశారని గుర్తుచేశారు. ప్రజల సమస్యలపై అధికారులకు వినతిపత్రం ఇవ్వడం తప్పా? అని ఆరేపల్లి శ్రీను ప్రశ్నించారు.Krishna District City News

స్థాయి మర్చి మాట్లాడొద్దు: టీడీపీ నాయకులకు హెచ్చరిక

నిన్న సాయంత్రం టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ పరసా సుబ్రమణ్యం, సీనియర్ నాయకుడు వీరంకి వెంకటేశ్వరరావు ఒక వీడియో విడుదల చేస్తూ తమ స్థాయికి మించి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై అసత్య ఆరోపణలు చేశారని తీవ్రంగా ఖండించారు.

“కనీసం వార్డు మెంబర్‌గా కూడా పోటీ చేయని పరసా సుబ్రమణ్యం, వీరంకి వెంకటేశ్వరరావు… గతంలో సోలోగా పోటీ చేసి 30 వేల భారీ మెజారిటీతో గెలిచిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌ను విమర్శించడమా?” అని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో అభివృద్ధి అంతా తమ హయాంలోనే జరిగిందని విర్రవీగుతున్న టీడీపీ నాయకులు తమ సొంత ఇళ్ల ముందే రోడ్లు వేయించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.

గతంలో గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత వీరాంజనేయ కాలనీలో రోడ్లను జీఎస్పీ (GSP)తో నిర్మించింది, మండల పరిషత్ నిధులతో తాగునీటి బోరు ఏర్పాటు చేసింది కైలే అనిల్ కుమారేనని ఆధారాలతో సహా వివరించారు. గతంలో మాజీ శాసనసభ్యులు డి.వై. దాస్, ఉప్పులేటి కల్పన, కైలే అనిల్ కుమార్ క్రమంగా కాలనీని అభివృద్ధి చేస్తూ వచ్చారని తెలిపారు.

ఎవరో మెప్పు కోసమో, వార్తల్లో నిలవడానికో నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని, నాయకుల తీరును ప్రజలంతా గమనిస్తున్నారని, తగిన సమయంలో గుణపాఠం చెబుతారని ఆరేపల్లి శ్రీను హెచ్చరించారు.

Author
Share This Article
Leave a review