యస్. భాస్కరరావు, రిపోర్టర్ | చిన్నగంజాం, బాపట్ల జిల్లా:

చిన్నగంజాం మండల తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ సభ్యులు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును మర్యాదపూర్వకంగా కలిశారు.
పర్చూరులోని ఏలూరి క్యాంపు కార్యాలయంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత సమక్షంలో నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.Bapatla District News
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత శుభాకాంక్షలు తెలియజేశారు. మండల పార్టీ అధ్యక్షుడిని ఎమ్మెల్యే ఏలూరి సత్కరించారు.



