సామాన్య కుటుంబం నుంచి వచ్చి స్వయంకృషితో అసామాన్యంగా ఎదిగిన ప్రజా నాయకుడు లేళ్ళ అప్పిరెడ్డి అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ (జోన్-3) పోలూరి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్పూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు లేళ్ళ అప్పిరెడ్డి గారి జన్మదిన వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన స్వగ్రామమైన అంకిరెడ్డిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల ఆవరణలో విద్యార్ధినీ విద్యార్ధుల సమక్షంలో గ్రామ అభివృద్ది కమిటీ ప్రతినిధులు లేళ్ళ అప్పిరెడ్డి బర్త్ డే కేక్ కట్ చేశారు. అనంతరం స్పూర్తి ఫౌండేషన్, ఏరువ జగదీశ్వరి కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు చెందిన ఇంటర్ విద్యార్ధినులకు ఉపకార వేతనాలు పంపిణీ చేయాలని కోరుతూ 60వేల రూపాయల నగదును జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రరావుకు అందజేశారు.ఈ సందర్భంగా పోలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ, విద్యార్ధి నేతగా.. యువజన, కార్మిక నాయకుడిగా.. మిర్చి యార్డు చైర్మన్‌గా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా.. పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడిగా.. శాసనమండలి సభ్యుడిగా.. ప్రభుత్వ విప్‌గా.. రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక బలమైన శక్తిగా ఎంత ఎదిగినా ఎంతో ఒదిగి ఉండే లేళ్ళ అప్పిరెడ్డి నేటి తరం రాజకీయ నాయకులందరికీ ఆదర్శవంతమైన నేత అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో అంకిరెడ్డిపాలెం అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కుర్రి సాంబిరెడ్డి, లేళ్ళ పెద్ద అప్పిరెడ్డి, మున్నంగి సంజీవరెడ్డి, కుర్రి పుల్లారెడ్డి, వజ్రాల వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డికి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోమవారం బృందావన్ గార్డెన్స్‌లోని క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన ఆయనను పలువురు పార్టీ నేతలు, మాజీ కార్పొరేటర్లు, పెద్ద సంఖ్యలో అభిమానులు, లీగల్ సెల్ నేతలు కలిసి పూలదండలు, పుష్పగుచ్ఛాలు, శాలువాలతో ఘనంగా సత్కరించడం ద్వారా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ కాండ్రకుంట గురవయ్య నేతృత్వంలో ఇద్దరు దివ్యాంగులకు ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి స్వయంగా ఎలక్ట్రికల్ వీల్ ఛైర్లు వితరణగా అందజేశారు.జన్మదిన వారోత్సవాలలో భాగంగా సోమవారం నగరంపాలెం సెంటర్లో షేక్ ఫాజిల్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్, పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం వైసీపీ ట్రేడ్ యూనియన్ గుంటూరు నగర కమిటీ ఆధ్వర్యంలో పట్టాభిపురంలోని మాతృశ్రీ అనాధ బాలుర ఆశ్రమంలో కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ బత్తుల దేవానంద్, మాజీ కార్పొరేటర్లు ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి), పడాల సుబ్బారెడ్డి, ట్రేడ్ యూనియన్ నాయకులు బైరెడ్డి రవీంద్రారెడ్డి, శేషగిరి పవన్, మేకా రవి, మురళి, పోకల వెంకటేశ్వరరావు, సింగు నరసింహారావు, గణేష్, జోసెఫ్, రామిరెడ్డి, పెయింట్ రాజు, నర్సిరెడ్డి, బడుగు నారాయణ, వడ్రాణం సుధాకర్, తోట వెంకటేష్, రమణారెడ్డి, ఓబుల్ రెడ్డి, అనిల్, మాదాసు భాగ్యారావు, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, కృపాశేఖర్, నీసు రాజు, చెన్నయ్య, రాజు, బద్రి, ఆరిఫ్, జిలానీ, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.
GUNTUR DISTRICT NEWS: ఎంత ఎదిగినా ఎంతో ఒదిగి ఉండే ప్రజానేత లేళ్ళ అప్పిరెడ్డి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
28°C
Vijayawada
light rain
28° _ 28°
84%
1 km/h
Mon
27 °C
Tue
33 °C
Wed
33 °C


