GUNTUR CITY NEWS: స్థానిక సంస్థల ఎన్నికలకు సీపీఐ శ్రేణులు సమాయత్తం కావాలి.

Karthik

జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ శక్తిమేరకు పోరాడేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు దిశా నిర్దేశం చేశారు. గురువారం గుంటూరు కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్‌లో ముప్పాళ్ల శివశంకరరావు అధ్యక్షతన సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో ఎన్నికల అవగాహన కుదుర్చుకుని ముందుకు సాగాలని సూచించారు. గుంటూరు, తెనాలి మున్సిపాలిటీల్లోని ఆయా డివిజన్లలో సీపీఐ అభ్యర్థులను పోటీకి నిలపాలని నిర్ణయించినట్లు తెలిపారు. మంగళగిరి, పొన్నూరులో ప్రస్తుతం ఎన్నికలు లేనందున, తదుపరి కార్యాచరణను బట్టి అక్కడ పోటీపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా కమిటీ సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, రాష్ట్ర పార్టీ నిర్ణయానికి అనుగుణంగా తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి అన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review