యస్. భాస్కరరావు, రిపోర్టర్ | చిన్నగంజాం: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాం పోలీస్‌స్టేషన్ నూతన ఎస్ఐగా సురేష్ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటివరకు చిన్నగంజాం ఎస్ఐగా విధులు నిర్వహించిన రమేష్ నెల్లూరుకు బదిలీ కావడంతో, ఆయన స్థానంలో ఇంకొల్లులో ఎస్ఐగా పనిచేసిన సురేష్‌ను చిన్నగంజాంకు బదిలీ చేశారు.

ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం సురేష్ చిన్నగంజాం ఎస్ఐగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ సిబ్బంది నూతన ఎస్ఐ సురేష్‌కు అభినందనలు తెలిపారు.



