GUNTUR DISTRICT NEWS: గుంటూరు మైత్రి మాల్‌లో సందడి చేసిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ టీం

Karthik

కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా టీం సభ్యులు గుంటూరులోని మైత్రి మాల్‌ను సందర్శించి సందడి చేశారు. ఈ సందర్భంగా సినిమా టీం సభ్యులు అభిమానులతో ముచ్చటిస్తూ సందడి వాతావరణాన్ని నెలకొల్పారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా మూడు గంటల పాటు సినిమాను ఆస్వాదించేలా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. సినిమా చూసిన ప్రేక్షకులు కుటుంబంతో కలిసి మంచి సమయం గడిపామని, సినిమా తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెబుతున్నట్లు పేర్కొన్నారు.కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి సినిమాను వీక్షించాలని మూవీ టీం ప్రేక్షకులను కోరింది. గుంటూరులో మైత్రి మాల్‌ను సందర్శించిన సందర్భంగా అభిమానుల సందడి, ప్రేక్షకుల ఆసక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పర్యటనతో సినిమా ప్రచారానికి మరింత ఉత్సాహం లభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మైత్రీ మాల్ ఫుడ్ కోర్ట్ యాజమాన్యం దాసరి శ్రీకాంత్,కాదంశెట్టి సతీష్ మరియు మైత్రీ సినిమాస్ మేనేజర్ భార్గవ్ చిత్ర ఘన విజయం సందర్భంగా హీరో శ్రీవిష్ణు రచయిత కోన వెంకట్ మరియు నిర్మాతని శాత్కరించి శుభకాంక్షలు తెలియజేసారు.

Author
Share This Article
Leave a review