Alluri sitaramaraju district News:మారేడుమిల్లి అడవుల్లో వేటగాళ్ల ఉచ్చులకు చెక్.. 69 ఉచ్చులు తొలగించిన అటవీ సిబ్బంది

S Sarath
1 View

అల్లూరి సీతారామరాజు జిల్లా (మారేడుమిల్లి):– అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో అక్రమ వేటగాళ్ల ఆగడాలకు అటవీ శాఖ సిబ్బంది అడ్డుకట్ట వేశారు. వన్యప్రాణులను వేటాడేందుకు వేటగాళ్లు అమర్చిన ఏకంగా 69 ఉచ్చులను సిబ్బంది గుర్తించి తొలగించారు.

అసలేం జరిగిందంటే? మారేడుమిల్లి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యంగా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక పెట్రోలింగ్ చేపట్టారు. బుధవారం రిజర్వ్ ఫారెస్ట్‌లోని కంపార్ట్‌మెంట్ నంబర్ 26/4లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించగా, మూడు చక్రాల వాహనాల బ్రేక్ వైర్లతో తయారు చేసి అమర్చిన 69 ఉచ్చులు బయటపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వాటిని తొలగించడంతో అనేక వన్యప్రాణులకు ప్రాణాపాయం తప్పింది. ఈ ఆపరేషన్‌లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు, యానిమల్ ట్రాకర్లతో పాటు బేస్ క్యాంప్ సిబ్బంది కీలక పాత్ర పోషించారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు: క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించి వన్యప్రాణుల ప్రాణాలను కాపాడిన అటవీ సిబ్బందిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. సిబ్బంది సమష్టి కృషి వల్లే జీవవైవిధ్యానికి పెను ముప్పు తప్పిందని ఆయన ప్రశంసించారు.

అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక దిశానిర్దేశం:

  • అటవీ ప్రాంతాల్లో నిరంతర నిఘా, ప్రత్యేక పెట్రోలింగ్‌ను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు.
  • వేటగాళ్లు ఉచ్చుల తయారీకి వాహనాల బ్రేక్ వైర్లను వాడుతున్న నేపథ్యంలో, ఆటోమొబైల్ షాపుల యజమానులు, మోటార్ మెకానిక్‌లకు దీనిపై అవగాహన కల్పించాలని సూచించారు.Amaravathi news
  • అడవుల్లో అమర్చే ప్రతి ఉచ్చు ఒక వన్యప్రాణి ప్రాణానికి ముప్పు అని పేర్కొంటూ, వన్యప్రాణుల సంరక్షణలో స్థానిక ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Author
Share This Article
Leave a review