Markapur District News :కనిగిరిలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు-శ్రీ గాయత్రీ దేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు.. లక్ష్మీనరసింహస్వామికి పంచామృత అభిషేకం

S Sarath
1 View

కనిగిరి:– పట్టణంలోని కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, శ్రీ గాయత్రీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.

స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీనరసింహస్వామికి పంచామృత అభిషేకం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి శ్రీచక్ర అలంకరణ, కుంకుమార్చన కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా జరిపించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.Markapuram District City News

ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ అధ్యక్షుడు కుందూరు తిరుపతిరెడ్డి, శారద దంపతులు, ఎంవీఎస్ నారాయణ, లక్ష్మీ దంపతులు, రత్నారెడ్డి, మాధవి దంపతులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review