కనిగిరి: పామూరు పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరుకావాలని వైఎస్సార్సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌ను దేవస్థానం నిర్వాహకులు ఆహ్వానించారు.
ఈ మేరకు దేవస్థానం ప్రతినిధులు దద్దాల నారాయణ యాదవ్‌ను కలిసి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. పది రోజులపాటు నిర్వహించనున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొనాలని కోరారు.Markapur District City News :కనిగిరి పోలీస్ స్టేషన్లో ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆకస్మిక తనిఖీ-స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షుడు కోటా నరసింహారావు, ఉపాధ్యక్షుడు మంచికంటి మధు, కార్యదర్శి గాదంశెట్టి గురు నారాయణ, కోశాధికారి దర్శి రాజేష్, జాయింట్ సెక్రటరీ కొత్తూరు గోపాలు తదితరులు పాల్గొన్నారు.



