దర్శి:– ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని 1వ వార్డులో రూ.11 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం సాయంత్రం దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి శంకుస్థాపన చేశారు. దర్శి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్, బీపీఎస్ గ్రాంట్ నిధులతో చేపట్టనున్న ఈ పనులకు భూమిపూజ నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.
పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే స్థానికులకు రాకపోకల్లో సౌకర్యం కలగనుంది.Prakasam Dist News
ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి-సుబ్బారావు, దర్శి మండల టీడీపీ అధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పుల్లలచెరువు సత్యనారాయణ, కౌన్సిలర్ వీసీ రెడ్డి, వెన్నపూస రామిరెడ్డి, కోరే లక్ష్మీనారాయణ, శ్రీలక్ష్మి, స్థానిక నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.



