దర్శి:- ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ఆదివారం సాయంత్రం ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఎన్ఏపీ చెరువు వద్ద గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో దర్శి రక్షిత మంచినీటి పథకంలో భాగంగా రూ.35 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన 2 ఎంఎల్డీ మైక్రో ఫిల్టర్లను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గంలో మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని చెప్పారు.
రూ.35 లక్షలతో ఏర్పాటు చేసిన మైక్రో ఫిల్టర్ల ద్వారా తాగునీటి శుద్ధి వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీటిని అందించడంలో ఈ ఏర్పాట్లు ఉపయోగపడనున్నాయి.Prakasam district News
ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ కె. శ్రీనివాసరావు, ఏఈ ఎ. హనుమాన్ బాబు, సంబంధిత అధికారులు, దర్శి మండల టీడీపీ అధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు, దర్శి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పుల్లలచెరువు సత్యనారాయణ, కౌన్సిలర్లు రామగిరి, వీ.సి.రెడ్డి, స్థానిక నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.



