Markapur District City News :రేపే మార్కాపురంలో విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు నూతన శాఖ ప్రారంభం-దక్షిణ భారతంలోనే అతిపెద్ద అర్బన్ బ్యాంకుగా విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు

S Sarath
1 View

మార్కాపురం:-దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుగా విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు విరాజిల్లుతోందని ఆ బ్యాంకు చైర్మన్ జె.వి. సత్యనారాయణమూర్తి తెలిపారు. మార్కాపురం పట్టణంలో బ్యాంకు నూతన శాఖను ఈ నెల 15వ తేదీన ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల గోకుల్ రెసిడెన్సీలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బ్యాంకు చైర్మన్ జె.వి. సత్యనారాయణమూర్తి మాట్లాడారు. విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు 62వ శాఖను మార్కాపురంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

దేశంలో పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చడంలో సహకార అర్బన్ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు ఆర్థిక సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో సహకార బ్యాంకుల సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయని వివరించారు.Markapuram District City News

మార్కాపురంలో నూతన శాఖ ప్రారంభంతో స్థానిక ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ కానున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా బ్యాంకు కార్యకలాపాలు, నూతన శాఖ ప్రారంభ ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను చైర్మన్ వెల్లడించారు.

Author
Share This Article
Leave a review