చిన్నగంజాం, బాపట్ల జిల్లా:– పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం మండలంలో దుర్గాష్టమి సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు జరిపారు.
చిన్నగంజాం గ్రామంలోని లలితాదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ధర్మవరపు ఏసు నారాయణ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.Bapatla District News
దుర్గాష్టమి సందర్భంగా ఆలయంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.



