Guntur City News :ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నేడే చివరి గడువు-అర్హులైన ఉపాధ్యాయులు వెంటనే ఫారం-19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

S Sarath
4 Views

గుంటూరు, నవంబరు 5:– కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు నవంబరు 6వ తేదీతో గడువు ముగియనుంది. మరో ఒక్క రోజు మాత్రమే సమయం ఉండటంతో అర్హులైన ఉపాధ్యాయులు వెంటనే ఫారం-19 ద్వారా దరఖాస్తు చేసుకుని ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి సూచించారు.

ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటర్ల జాబితాను కొత్తగా రూపొందించడం జరుగుతుందని, గతంలో ఓటర్లుగా నమోదైన ఉపాధ్యాయులు సైతం ప్రస్తుత ఎన్నికల కోసం మళ్లీ కొత్తగా ఫారం-19 సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తూ అర్హత కలిగిన ఉపాధ్యాయులందరూ గడువు ముగిసేలోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో 13,505 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు కాగా, ప్రస్తుత నమోదు ప్రక్రియలో ఇప్పటివరకు 10,909 దరఖాస్తులు మాత్రమే అందినట్లు ఖాజావలి వెల్లడించారు. గత ఎన్నికల గణాంకాలతో పోలిస్తే ఇంకా సుమారు 2,600 మందికి పైగా అర్హులైన ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు కావాల్సి ఉందని తెలిపారు.Guntur City News

ఓటు హక్కు కలిగిన ప్రతి ఉపాధ్యాయుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, చివరి తేదీ వరకు వేచి చూడకుండా నవంబరు 6వ తేదీలోగా ఫారం-19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Author
Share This Article
Leave a review