ప్లాస్టిక్‌ను వీడుదాం.. ప్రకృతిని కాపాడుకుందాం! మన గుంటూరు.. స్వచ్ఛ గుంటూరు.. హరిత గుంటూరు!

Karthik

ప్లాస్టిక్ సంచి వద్దు.. చేతి సంచి ముద్దు!
వీధి నాటకంతో పర్యావరణ పరిరక్షణపై వినూత్న అవగాహన! స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ‘ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం’ అనే సంకల్పంతో మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ కార్యాలయం వద్ద వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర మేయర్ లక్ష్మీ అపర్ణ కోవెలమూడి, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం, పర్యావరణ పరిరక్షణ అంశాలను ప్రధానంగా తీసుకుని కళాకారులు ప్రదర్శించిన వీధి నాటకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నృత్యాలు, పాటలు, అర్థవంతమైన సంభాషణలతో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. కళాకారుల ప్రదర్శనలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు పర్యావరణంపై ఆలోచింపజేశాయి.
ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా వస్త్ర సంచులు, పునర్వినియోగ చేతి సంచులను ఉపయోగించాలని, ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పులతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ఈ కార్యక్రమం ద్వారా సందేశమిచ్చారు.

Author
Share This Article
Leave a review