రూ.74.25 కోట్లతో గుంటూరు నగరంలో 13.5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ముందడుగు

Karthik

ఎన్ఐయూఏ, సిపిపిఎఫ్ ల సహకారంతో ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ప్రాజెక్ట్ రెండేళ్ల నిర్మాణ కాలంతో కలిపి 27 సంవత్సరాల కన్సెషన్ కాలానికి ప్రాజెక్టు నిర్వహణ ఏజన్సీదే ప్రాజెక్ట్ వలన యూనిట్ విద్యుత్ సుమారు రూ.3 నుంచి రూ.3.15 ధరలో అందుబాటులోకి వస్తుందని అంచనా గురువారం ఆన్ లైన్ లో ఎన్ఐయూఏతో ఎంఓయూ పూర్తి కమిషనర్ కె.మయూర్ అశోక్కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని న్యూఢిల్లీకి చెందిన జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ (ఎన్ఐయూఏ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న క్లైమేట్ ప్రాజెక్ట్స్ ప్రిపరేషన్ ఫెసిలిటీ (సిపిపిఎఫ్) సహకారంతో గుంటూరు నగరంలో 13.5 మెగావాట్ల క్యాప్టివ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు గుంటూరు నగరపాలక సంస్థ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. గురువారం ఆన్‌లైన్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్ఐయూఏ డైరెక్టర్ డాక్టర్ దేబోలినా కుండు, గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పట్టణాల్లో వాతావరణ మార్పులను ఎదుర్కొనే పర్యావరణహిత ప్రాజెక్టులను ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య విధానంలో చేపట్టేందుకు సాంకేతిక, ఆర్థిక సలహా సహకారం అందించేందుకు ఏర్పాటైన దేశంలోనే మొట్టమొదటి ప్రత్యేక వేదిక సిపిపిఎఫ్ అని అన్నారు. నగరపాలక సంస్థ విద్యుత్ అవసరాలను సౌరశక్తి ద్వారానే తీర్చుకునే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నామన్నారు. రూ.60.75 కోట్లతో 13.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌తో పాటు, సూర్యరశ్మి లేని సమయాల్లోనూ విద్యుత్ అందించేందుకు రూ.13.50 కోట్లతో 3 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ను కూడా ఏర్పాటు చేయనున్నామని, మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.74.25 కోట్లని తెలిపారు. ఈ ప్రాజెక్టును డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, మెయింటెయిన్ పద్ధతిలో పిపిపి విధానంలో చేపడతామని, బహిరంగ టెండర్ల ద్వారా ఈ రంగంలో అనుభవం ఉన్న సంస్థల్లో అతి తక్కువ టారిఫ్ కోట్ చేసిన సంస్థను ఎంపిక చేస్తామని చెప్పారు. రెండేళ్ల నిర్మాణ కాలంతో కలిపి 27 సంవత్సరాల కన్సెషన్ కాలానికి ప్రాజెక్టును అప్పగిస్తామని, ప్రాజెక్టు యాజమాన్యం పూర్తిగా నగరపాలక సంస్థదేనని పేర్కొన్నారు.ఈ ప్లాంట్ ద్వారా యూనిట్ విద్యుత్ సుమారు రూ.3 నుంచి రూ.3.15 ధరలో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నామని, దీంతో సంప్రదాయ (పునరుత్పాదకం కాని) విద్యుత్‌పై ఆధారపడటం గణనీయంగా తగ్గి, కర్బన ఉద్గారాలు తగ్గుతాయన్నారు. ఒప్పందం ప్రకారం సాధ్యాసాధ్యాల అధ్యయనం (ఫీజిబిలిటీ స్టడీ), ఆర్థిక నిర్మాణం, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ తో సహా టెండర్ పత్రాల తయారీ, బిడ్ ప్రక్రియ నిర్వహణ, పిపిపి భాగస్వామి ఎంపిక వరకు సిపిపిఎఫ్ సహకారం అందిస్తుందని, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, క్లైమేట్ ఫైనాన్స్ వంటి నిధులు పొందేందుకు కూడా తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. ప్రాజెక్టు సన్నద్ధతకు అయ్యే ఖర్చులను సిపిపిఎఫ్ భరిస్తుందని, ఇప్పటికే ప్రాజెక్టు కాన్సెప్ట్ నోట్ సమర్పించి నగరపాలక సంస్థ కౌన్సిల్ (ప్రత్యేక అధికారి) ఆమోదం పొందామని పేర్కొన్నారు.పర్యావరణ పరిరక్షణ దిశగా ఈ ప్రాజెక్టు గుంటూరు నగరానికి ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని, ఈ ప్రయత్నంలో సహకారం అందిస్తున్న ఎన్ఐయూఏ, సిపిపిఎఫ్ ల బృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును అమలులోకి తెచ్చి, హరిత ఇంధన వినియోగంలో గుంటూరు నగరాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.

Author
Share This Article
Leave a review