రాష్ట్రంలో మరొసారి ఎన్నికలు

Karthik

*4 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల**మంగళగిరి – తాడేపల్లితో పాటు 4 కార్పొరేషన్లలో మేయర్, వార్డు సభ్యుల ఎన్నిక**విజయవాడ:* రాష్ట్రంలోని 4 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్‌ను ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం (12-11-2026) విడుదల చేసింది.శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి – తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్‌తో పాటు వార్డు సభ్యుల ఎన్నిక జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా, ఐఏఎస్ (రిటైర్డ్) నోటిఫికేషన్ నం. 1490/ఎస్ఈసీ-ఎఫ్1/2026-1, 2 జారీ చేశారు.*ఎన్నికల షెడ్యూల్ ఇదీ:*తేదీ కార్యక్రమం14-11-2026 (శనివారం) రిటర్నింగ్ అధికారి ద్వారా పబ్లిక్ నోటీసు జారీ, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం (ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు)16-11-2026 (సోమవారం) నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ (మధ్యాహ్నం 3 గంటల వరకు)17-11-2026 (మంగళవారం) నామినేషన్ల పరిశీలన (ఉదయం 11 గంటల నుండి)19-11-2026 (గురువారం) ఉపసంహరణకు చివరి తేదీ (మధ్యాహ్నం 3 గంటల వరకు), పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రచురణ (మధ్యాహ్నం 3 గంటల తర్వాత)26-11-2026 (గురువారం) పోలింగ్ (ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు)27-11-2026 (శుక్రవారం)రీ పోలింగ్ (అవసరమైతే)30-11-2026 (సోమవారం) ఓట్ల లెక్కింపు (ఉదయం 8 గంటల నుండి)మంగళగిరి – తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై అభ్యర్థుల్లో, రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది.

Author
Share This Article
Leave a review