GUNTUR DISTRICT NEWS: స్వర్థ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర విజయవంతం చేయాలి

Karthik

స్వర్థ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర (సాసా) కార్యక్రమాన్ని శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆదేశించారు. స్వర్థ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర (సాసా) కార్యక్రమంపై శుక్రవారం జిల్లా, మండల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి సాసా కార్యక్రమాన్ని అంకితభావంతో చేపట్టాలని ఆదేశించారు. ప్రతి గ్రామం పరిశుభ్రతకు ఆలవాలం కావాలని అన్నారు. గ్రామ సీమలు పరిశుభ్రతకు, పచ్చదనానికి చిరునామా కావాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటి పరిశుభ్రత, ప్రతి ఒక్కరి ఆరోగ్యం, ప్రతి గ్రామ పంచాయతీ పచ్చదనంపై దృష్టి సారించాలని ఆదేశించారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను పక్కాగా నిర్వహించాలని, గ్రీన్ ఎంటర్ ప్రేన్యూయర్ వ్యవస్థను బలోపేతం చేయాలని అన్నారు. ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ నివారణ పట్ల దృష్టి సారించాలని సూచించారు. చెత్తతో ఆర్థిక అభివృద్ధి దిశగా అడుగులు పడాలని అన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువత, వ్యాపార వేత్తలు గ్రీన్ ఎంటర్ ప్రేన్యూయర్ లుగా ఎదుగుటకు ప్రోత్సహించాలని చెప్పారు. రీసైక్లింగ్ రిపేర్ అండ్ రియూస్, కాంపోజిటింగ్, అప్ సైక్లింగ్ ఆధారిత వ్యాపారాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. RRR Centres బలోపేతం పై అవగాహన కల్పించాలి. గ్రామ పంచాయతీలు, స్వయం సహాయక సంఘాలు, ప్రజా ప్రతినిధులతో అవగాహన సమావేశాలు నిర్వహించాలన్నారు. ఇంటి పద్దనే పొడి వ్వర్ణాలను వేరు చేయడం అవసరమని, స్వచ్ఛ రథం ద్వారా సేకరణ చేయాలని దీని పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. స్వచ్ఛ రథం సేకరించిన పొడి వ్వర్ణాలను గ్రీన్ అంబాసిడర్లు చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు తరలించాలని అన్నారు. తడి వ్యర్థాలను సేకరించి వర్మి కంపోస్ట్ తయారు చేయాలని అన్నారు. స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలను పాఠశాలలు, కళాశాలలు, ఎస్.హెచ్.జిలు, యువజన సంఘాలతో నిర్వహించాలని ఆదేశించారు. *పరిశుభ్ర గ్రామం – ఆరోగ్య గ్రామం*ప్రతి గ్రామపంచాయతీలో పరిశుభ్ర గ్రామం – ఆరోగ్య గ్రామం కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. స్వచ్ఛ గ్రామం – ప్లాస్టిక్ రహిత గ్రామం – గ్రీన్ ఆంధ్ర లక్ష్య సాధనలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ను నివారించుటకు బార్టన్ బ్యాంక్ “(Bartan Bank) (Utensils Bank)” కార్యక్రమం ద్వారా చర్యలు చేపట్టాలని సూచించారు. గుడ్డ సంచులు వినియోగం పెరిగే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review