Guntur City News :భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి-జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, ఆర్.ఓ.బి.ల పనుల్లో జాప్యం లేకుండా చర్యలు-అధికారులకు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ ఆదేశాలు

S Sarath
2 Views

గుంటూరు, నవంబర్ 13:– జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, రైల్వే ఓవర్ బ్రిడ్జిల (ఆర్.ఓ.బి.) నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, అభివృద్ధి పనులకు ఆటంకాలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం సాయంత్రం జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, ఆర్.ఓ.బి.ల భూసేకరణ పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూముల సేకరణలో ఇప్పటివరకు జరిగిన పురోగతిని సమీక్షించారు. ఇంకా పరిష్కారం కాని అంశాలు, పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రతిపాదనలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భూసేకరణ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రెవెన్యూ, జాతీయ రహదారులు, రైల్వే శాఖల మధ్య సమన్వయం పెంచుకుని భూసేకరణకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో జాప్యం జరగకుండా నిర్ణీత గడువులోగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు సకాలంలో కార్యరూపం దాల్చేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు.Guntur City News

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, రెవెన్యూ డివిజనల్ అధికారులు శ్రీనివాసరావు, రమణి, ఎన్.హెచ్.ఏ.ఐ., రైల్వే శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review