బీఈడీ వన్ టైం పరీక్షల షెడ్యూల్ విడుదల.

Karthik

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు డాక్టర్ రమేష్ పంతగాని జోక్యంతోనే బీఈడీ వన్ టైం పరీక్షల షెడ్యూల్ విడుదల. మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేసి.. జూలై 13న నిర్వహించాల్సిన వన్ టైం పరీక్షలను వైసీపీ విద్యార్థి విభాగం జోక్యంతోనే డిసెంబర్ 12 నుంచి నిర్వహిస్తున్నట్టు సోమవారం షెడ్యూల్ విడుదల చేశారని ఏఎన్యూ వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పంతగాని రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉన్న యూనివర్సిటీ వైసిపి విద్యార్థి విభాగం చొరవ వల్లే నోటిఫికేషన్ ఎట్టకేలకు వెలువరించిందన్నారు. వర్సిటీ కేటాయించిన రెండు సెంటర్లలో ఒక సెంటర్ లో పరీక్షలు నిర్వహణ లో ఏటువంటి అక్రమాలు జరిగిన సహించమన్నారు. గత రెండు సంవత్సరాలుగా పీజీ విభాగానికి చెందిన ఏ పరీక్ష జరిగిన అదే సెంటర్ కేటాయించడంపై… అదే కళాశాలలోని లెక్చరర్లకు కీలక పరీక్షల బాధ్యతలు అప్పగించడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. బీఈడీ మోడరేషన్ బోర్డ్ ను వర్సిటీలో నిర్వహించాలని ఆయన సూచించారు.

Author
Share This Article
Leave a review