BAPATLA DISTRICT CITY NEWS: చీరాలలో రైతులకు 80% సబ్సిడీతో మినుముల విత్తనాల పంపిణీ

City News Telugu

ఘని భాషా, రిపోర్టర్ | చీరాల:

బాపట్ల జిల్లా చీరాలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య రైతులకు 80 శాతం సబ్సిడీతో మినుముల విత్తనాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మినుము పంట సాగుకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. మొదటి విడతలో చీరాల మండలానికి 292 క్వింటాళ్లు, వేటపాలెం మండలానికి 120 క్వింటాళ్ల మినుముల విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అవసరం ఉన్న రైతులు మాత్రమే విత్తనాలను తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సబ్సిడీ విత్తనాలను ఉపయోగించుకుని రైతులు పంట సాగులో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ కౌతవరపు జనార్దన్, పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు దోగిపర్తి సురేష్, తేలప్రోలు రమేష్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Share This Article
Leave a review