గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ శుక్ర, శనివారాల్లో (20,21 తేదీల్లో) ప్రత్యేక ‘ఎల్ఆర్ఎస్ మేళా’ నిర్వహిస్తున్నట్లు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, దరఖాస్తుదారుల సౌకర్యార్థం గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో, బృందావన్ గార్డెన్స్‌లోని సర్కిల్ కార్యాలయంలో ఈ ప్రత్యేక మేళా కొనసాగుతుందన్నారు. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకుని ఇంకా సంబంధిత ఫీజు చెల్లించాల్సి ఉన్నవారు, అలాగే దరఖాస్తుల పరిశీలనలో భాగంగా షార్ట్ ఫాల్ ఎండార్స్మెంట్లు జారీ చేయబడి అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉన్నవారు ఈ మేళాకు హాజరై తమ పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేసుకోవచ్చని వివరించారు. ఈ మేళాలో టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి దరఖాస్తుదారుల సందేహాలను నివృత్తి చేస్తూ అక్కడికక్కడే దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తారని తెలిపారు. కావున, పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేసుకోవడానికి లభించిన ఈ సదావకాశాన్ని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని, సంబంధిత పత్రాలు మరియు రసీదులతో హాజరై తమ దరఖాస్తులను పూర్తి చేసుకోవాలని కోరారు.
ఈనెల 20,21వ తేదీల్లో జిఎంసి ఆధ్వర్యంలో ప్రత్యేక ఎల్ఆర్ఎస్ మేళా

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
26°C
Vijayawada
mist
26° _ 26°
78%
2 km/h
Sun
26 °C
Mon
31 °C
Tue
31 °C


