గత 8 దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలలో విద్యారంగంలో అవిరళ కృషి చేసి ఐఐటి రామయ్యగా పేరుగాంచిన చుక్కా రామయ్య జీవితం ఆదర్శప్రాయమని శాసనమండలి మాజీ సభ్యులు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కె.ఎస్. లక్ష్మణరావు తెలిపారు. ఈనెల 21వ తేదీన గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో జరిగిన చుక్కా రామయ్య 100వ జన్మదినోత్సవ కార్యక్రమానికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. కె.ఎస్. లక్ష్మణరావు ప్రసంగిస్తూ చుక్కా రామయ్య సాంప్రదాయక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినా గాంధీజీ పిలుపునందుకుని అస్పృశ్యత వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారని, 1946 నుండి 1951 మధ్య జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని నిజాం రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన సందర్భంగా 30 నెలల పాటు జైలు శిక్షను అనుభవించారని వివరించారు. గణిత శాస్త్ర అధ్యాపకునిగా విద్యార్థుల మన్ననలను పొందినారని, 1983లో నాగార్జునసాగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేసినారని, అనంతరం హైదరాబాదులోని నల్లకుంట లో ప్రతిభ గల విద్యార్థులకు ఐఐటి కోచింగ్ ఇస్తూ దాదాపు 1500 మంది విద్యార్థులు ఐఐటి సీట్లు పొందడంలో క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. 2007 నుండి 2013 వరకు శాసనమండలి సభ్యునిగా, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఫ్లోర్ లీడర్ గా పనిచేసినారని, ఉపాధ్యాయ సమస్యల తో పాటు పేదల అభ్యున్నతికి తన వాణిని శాసనమండలిలో వినిపించారన్నారు. జన చైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ బాసరలో ఐఐటి విద్యాసంస్థ ఏర్పాటుకు అవిరళ కృషి జరిపారని, తత్ఫలితంగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐఐఐ టిని ఏర్పాటు చేసినారన్నారు. విద్య వ్యాపారంగా మారకూడదని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, విద్యార్థులలో ప్రశ్నించేతత్వం పెంపొందించే విధంగా సృజనాత్మకతను ప్రోత్సహించే విధంగా విద్య కొనసాగాలని చుక్కారామయ్య కోరుకున్నారని గుర్తు చేశారు. ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి, ఎ.ఆర్. సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ చుక్కా రామయ్య చేసిన కృషిని గుర్తించి తెలుగు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చి పద్మశ్రీ అవార్డుకు వారిని ఎంపిక చేయాలని కోరారు. ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టర్ ప్రసంగిస్తూ చుక్కా రామయ్య నుండి సమయపాలన నేర్చుకోవాలని, వారు నిరంతరం అధ్యాయన శీలి అని కొనియాడారు. ఐఐటి కోచింగ్ ను వ్యాపారమయం చేయకుండా నిబద్ధతతో నిర్వహించారన్నారు. జాషువా విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు వి.వి.కె. సురేష్ ప్రసంగిస్తూ తెలుగు రాష్ట్రాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత అంతటి అభిమానాన్ని చుక్కా రామయ్య చూరగొన్నారని, నేటి అధ్యాపకులు వారిని ఆదర్శంగా తీసుకుని కృషి చేయాలన్నారు. హిందూ ఫార్మసీ కళాశాల సెక్రటరీ ఎస్.వి.ఎస్ లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ చుక్కారామయ్య తీర్చిదిద్దిన వేలాది మంది విద్యార్థులు నేడు ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో కొనసాగడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మా ధనుంజయ రెడ్డి, అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, రాజ్యాంగ చర్చా వేదిక కార్యదర్శి అవధానుల హరి, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ అబ్బరాజు రాజశేఖర్, డా|| ఏపీజె అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షులు కనకమేడల అప్పారావు, రాజరాజేశ్వరి సాయి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జొన్నల రాజేశ్వరి, మానవత నేతలు సూరం నారాయణరెడ్డి, టి.వి.సాయిరాం, మేకల రామారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. తొలుత ప్రజా గాయకులు పి.వి. రమణ చుక్కా రామయ్య చేసిన కృషిని తెలుపుతూ తన స్వీయ రచనతో ఆలపించిన గేయం సభికులను ఆలోచింపజేసింది.
ఐఐటి రామయ్య ఆశయాలను అమలు చేయాలి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
29°C
Vijayawada
scattered clouds
29° _ 29°
58%
4 km/h
Sun
29 °C
Mon
31 °C
Tue
31 °C


