ఓటర్ వెబ్ సైట్ లో ఆధార్ సెర్చ్ ఆప్షన్ ఇవ్వాలని, ఆధార్ అడ్రస్ లోనే ఓటు హక్కు కూడా కల్పించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ టి. సేవ కుమార్ , రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కు విజ్ఞాపన పత్రం అందజేసి, ఈసీ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఆధార్ కార్డు పౌరసత్వ నిర్ధారణ పత్రం కాదని, ఒక గుర్తింపు కార్డు మాత్రమేనని సుప్రీం కోర్టు పేర్కొన్న విషయం మనందరికీ తెలిసిందే అన్నారు.ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన ఓటు హక్కురాదని, లేనంత మాత్రాన ఓటు హక్కు నిరాకరించకూడదని కూడా సుప్రీంకోర్టు తెలిపిందన్నారు. అంతేగాని ఓటర్ వెబ్ సైట్ లో ఆధార్ సెర్చ్ ఆప్షన్ ఇవ్వవద్దని గాని ,డూప్లికేట్ ఓటర్లను గుర్తించుటకు ఆధార్ కార్డు వాడవద్దని గాని చెప్పలేదని , భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో ప్రతి వ్యక్తి గుర్తింపుకు ఆధార్ కార్డు నే ప్రధాన గుర్తింపు కార్డుగా పేర్కొనడం జరుగుతుందన్నారు. అంతేగాక అన్ని రాష్ట్రాలలో ఆధార్ కార్డును ఓటర్ కార్డ్ తో అనుసంధానం ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ అంతకుముందే ఆధార్ కార్డుతో ఓటర్ కార్డు అనుసంధానం చేయడం చాలావరకు పూర్తయిందన్నారు. నేడు చాలామంది ఓటర్లు ఆధార్ కార్డును ఒకచోట ఉండగా ఓటర్ కార్డు మరో నియోజకవర్గంలో, మరో రాష్ట్రంలో ఉండడం జరుగుతోందన్నారు.దీనివల్ల కొందరు ఆయా రాష్ట్రాలలో పథకాల పరంగాను, ఎన్నికల సమయంలో కొన్ని రకాల ప్రయోజనాలను అక్రమంగా పొందడం జరుగుతోందన్నారు. ఈ పరిస్థితులలో డూప్లికేట్ ఓట్లను పూర్తిగా తొలగించేందుకు ఆధార్ సెర్చ్ ఆప్షన్ ను, ఆధార అడ్రస్ లోనే ఓటు హక్కును కూడా తప్పనిసరి చేసి, ఆధార్ కార్డ్ లో వ్యక్తిపేరు ,ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ మార్చే వీలు లేకుండా అడ్రస్ ను మాత్రమే సులభంగా మార్చుకునే విషయంలో ప్రభుత్వం ఆలోచించాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందుకు కృషి చేయాలని డాక్టర్ సేవ కుమార్ ఆ వినతి పత్రంలో ఈసీఐని కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన రాజకీయ పార్టీల మీటింగ్ లో ఆప్ తరుపున రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ టి .సేవ కుమార్, రాష్ట్ర కార్యదర్శి కల్లూరి సుబ్రహ్మణ్యం, బాపట్ల జిల్లా కన్వీనర్ ఏ బాలాజీ రెడ్డి పాల్గొన్నారు.
GUNTUR DISTRICT NEWS: ఓటర్ వెబ్ సైట్ లో ఆధార్ సెర్చ్ ఆప్షన్ ఇవ్వాలి – ఆధార్ అడ్రస్ లోనే ఓటు హక్కు కూడా కల్పించాలి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
31°C
Vijayawada
light rain
31° _ 31°
61%
7 km/h
Sat
33 °C
Sun
34 °C
Mon
35 °C


