Bapatla District City News :వేమూరు ఎంపీటీసీ ఎన్నికలకు 66 నామినేషన్లు-12 సెగ్మెంట్లకు నామినేషన్ల దాఖలు పూర్తి

S Sarath
1 View

బాపట్ల జిల్లా, వేమూరు:- స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వేమూరు మండల పరిషత్ పరిధిలోని 12 ఎంపీటీసీ సెగ్మెంట్లకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. మొత్తం 66 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనంతరాజు వెల్లడించారు.

నామినేషన్ల ప్రక్రియలో తొలిరోజైన బుధవారం మూడు నామినేషన్లు దాఖలు కాగా, గురువారం 29, చివరి రోజైన శుక్రవారం 33 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు.

పార్టీల వారీగా చూస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 30, తెలుగుదేశం పార్టీ నుంచి 20, జనసేన పార్టీ నుంచి ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. మరో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు సమర్పించారు.Bapatla District City News

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఆదివారం పరిశీలన అనంతరం అభ్యంతరాలను స్వీకరిస్తామని అనంతరాజు తెలిపారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

Author
Share This Article
Leave a review