పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి: మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్
పంచాయతీ ఎన్నికల్లో కూటమి నిబంధనలకు అనుగుణంగా పోటీకి సిద్ధం కావాలి: ఆమంచి శ్రీనివాసరావు
బాపట్ల జిల్లా, వేటపాలెం: జనసేన పార్టీని రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని వేటపాలెంలో జనసేన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి శ్రీనివాసరావు నివాసం వద్ద నిర్వహించారు.
ఈ సమావేశంలో పెదపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ చీరాలలో ప్రత్యేక రాజకీయ పరిస్థితులు ఉన్నప్పటికీ జనసేన పార్టీ రెండు వార్డుల్లో కౌన్సిలర్లను గెలిపించుకోవడంతో పాటు ఎంపీటీసీ స్థానాన్ని కూడా సాధించిందని తెలిపారు. గెలిచినా, ఓడినా ప్రజాసేవే లక్ష్యంగా జనసేన పనిచేస్తుందని పేర్కొన్నారు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించే నాయకులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు.
జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆమంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ మంచి రాజకీయ వ్యవస్థతోనే మంచి సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. ఇటీవల పార్లమెంట్, నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేసినప్పటికీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ శక్తి మేరకు కృషి చేశారని పేర్కొన్నారు.
జనసేన పోటీ చేసిన కొన్ని స్థానాల్లో టీడీపీ రెబల్ అభ్యర్థులు పోటీలో నిలవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో జనసేనకు తగిన ప్రాధాన్యత కల్పిస్తూ కూటమి నియమాలకు కట్టుబడి తమ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బైట్స్:
- పెదపూడి విజయ్ కుమార్, మాల కార్పొరేషన్ చైర్మన్
- ఆమంచి శ్రీనివాసరావు, జనసేన రాష్ట్ర కార్యదర్శి



