BAPATLA DISTRICT CITY NEWS : చీరాల మున్సిపల్ ఎన్నికలకు వైసీపీ సమాయత్తం

City News Telugu

B. Sankar – District Incharge,Bapatla

బాపట్ల, అక్టోబర్ 10: చీరాల మున్సిపల్ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఆ పార్టీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్ బాబు శుక్రవారం పాపరాజుతోట తోటలోని మాజీ కౌన్సిలర్, బాపట్ల జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు అధ్వక్షుడైన చీమకుర్తి బాలకృష్ణ నివాసంలో లాంఛనంగా మున్సిపల్ ఎన్నికలకు సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అభ్యర్థులు కూడా రెడీగా ఉండాలని పేర్కొన్నారు. మరోవైపు ప్రజల మూడ్‌లో మార్పు వచ్చిందని, వైసీపీ అనుకూల సంకేతాలు వస్తున్నాయని వెంకటేష్ తెలిపారు.

వైసీపీ అధీనంలో మున్సిపాలిటీ ఉండగా జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు, వైసీపీ మున్సిపల్ విభాగం రాష్ట్ర కార్యదర్శి గుంటూరు ప్రభాకరరావు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.About Us

SUBSCRIBE TO BAPATLA CITY NEWS YOUTUBE CHANNEL FOR DAILY NEWS UPDATES

https://www.youtube.com/@bapatlacitynewstelugu

Share This Article
Leave a review