GUNTUR DISTRICT NEWS: కడపలో 28, 29, 30 తేదీల్లో సీపీఐ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలు

Karthik

సీపీఐ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలను కడప నగరంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. ఆదివారం గుంటూరు సిపిఐ కార్యాలయం మల్లయ్య లింగం భవన్ లో ఆయన మాట్లాడారు. 28వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశాల్లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శులు కె.రామకృష్ణ, పల్లా వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడాలని, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. కడపలో జరిగే ప్లీనరీ సమావేశాల్లో ప్రజా సమస్యలు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, ఆటో కార్మికుల సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ పోరాటాలను మరింత ముందుకు తీసుకెళ్తుందని జంగాల అజయ్ కుమార్ స్పష్టం చేశారు.

Author
Share This Article
Leave a review