అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో మత్తుపదార్థాలు యువతపై ప్రభావం” అనే అంశం పై అవగాహన కార్యక్రమం జరిగింది. గురజాడ అప్పారావు 164వ జయంతి సందర్భంగా పేరేచర్ల ఇంటెల్ హై స్కూల్లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎల్. అరుణ అధ్యక్షత వహించగా కే పద్మ మాట్లాడారు. గంజాయి డ్రెస్ స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజీ పీజీ విద్యార్థులపై ఎంతో ప్రభావం చూపుతుందని అన్నారు. చాప కింద నీరులా విస్తరిస్తుందని బిస్కెట్లు, చాక్లెట్ల రూపంలో విద్యార్థులకు అలవాటు చేయగా తద్వారా దానికి బానిసలై వివిధ రూపాల్లో నేరాలు చేస్తూ తనను తన జీవితాన్ని తన కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నాయని అన్నారు. మద్యం మత్తులో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని కన్న తల్లిదండ్రులపై కూడా దాడి చేస్తున్నారని చెప్పారు. డ్రగ్స్ వ్యాపారం చేయటానికి కూడా అలవాటు పడుతున్నారని ఎవరైనా అపరిచిత వ్యక్తులు వెంబడిస్తుంటే తల్లిదండ్రులకు కానీ టీచర్లకు గానీ చెప్పాలని సూచించారు. మత్తు పదార్థం గంజాయి డ్రగ్స్ సేవించడం వల్ల అనారోగ్యం పాలు అవుతున్నారని యువత మత్తులో నిర్వీర్యమైపోతున్నారని తెలిపారు. ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతున్నారని అన్నారు. ఐద్వాజిల్లా నాయకులు ఏ కళ్యాణి మాట్లాడుతూ మద్యం మత్తు పదార్థాలు సేవించడం వల్ల హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని గంజాయి డ్రగ్స్ సేవించిన వాళ్లు అచేతనంగా ఉండటం ,విచిత్రంగా ప్రవర్తించడం ,ఒంటరిగా ఫీల్ అవ్వటం మత్తుకు బానిసలవడం అలాంటి ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. చదువుతోపాటు ఇలాంటి అవగాహన కార్యక్రమాల్లో ప్రతి ఒక్క విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని తల్లిదండ్రులతో ప్రతిరోజు మంచి చెడు గురించి ఒకరికొకరు కుటుంబంలో చర్చించుకోవాలని మంచి ప్రవర్తన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ రాణి, హుస్సేన్ , టీచర్స్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
GUNTUR DISTRICT NEWS: మత్తు పదార్థాల జోలికి వెళితే జీవితం అంధకారం అవుతుంది

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
26°C
Vijayawada
overcast clouds
26° _ 26°
95%
2 km/h
Tue
33 °C
Wed
25 °C
Thu
24 °C


