చిన్నగంజాం:– మార్కాపురంలో ఈ నెల 16, 17, 18 తేదీల్లో జరగనున్న 52వ అంతర్ జిల్లాల జూనియర్స్ కబడ్డీ పోటీల్లో పాల్గొనే బాపట్ల జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు.
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాం మండలంలోని కొత్తపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 5వ తేదీ నుంచి కబడ్డీ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రతిభ కనబరిచిన 14 మంది క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు.

క్రీడాకారులకు దుస్తులను ది మిషన్ ఫౌండర్, యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కొట్టే ఏడుకొండలు అందించారు. అదేవిధంగా శ్రీ బాల కోటేశ్వర స్వామి ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు మరపాల ఏడుకొండలు రెడ్డి, కోట శ్రీనివాసరెడ్డి, రాజు రామకోటిరెడ్డి క్రీడాకారులకు అధికారిక టీ-షర్టులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కబడ్డీ కార్యదర్శి మంతెన సుబ్బరాజు, వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు, సీనియర్ క్రీడాకారుడు ఆమంచి శ్రీనివాసరావు, చిన్నగంజాం పోలీస్ స్టేషన్ రైటర్ ప్రకాష్, ఆలయ కమిటీ ట్రెజరర్ రాజు రామకోటిరెడ్డి, కమిటీ సభ్యులు అక్కల సాంబశివారెడ్డి, బక్క సుబ్బారెడ్డి, సీనియర్ క్రీడాకారుడు మూలగాని శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.Bapatla District News
జిల్లా జట్టుకు కోట హరిప్రసాద్ రెడ్డి కోచ్గా, సైకం నాగూర్ మేనేజర్గా వ్యవహరించనున్నారు. రాబోయే అంతర్ జిల్లాల పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.



