దర్శి:- పేద, మధ్యతరగతి కుటుంబాలు వైద్య ఖర్చుల కోసం అప్పుల పాలుకాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. బుధవారం దర్శి పట్టణంలోని టీడీపీ కార్యక్రమంలో 83 మంది లబ్ధిదారులకు రూ.45,44,427 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆమె పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్సలు చేయించుకోలేని పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ నిధులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అవసరమైన సమయంలో ఆర్థిక సహాయం అందిస్తూ కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రజల కష్టాల్లో తోడుగా ఉంటూ, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరారు.Prakasam district News
ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గంలోని మండల, పట్టణ టీడీపీ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, మోడీ ఆంజనేయులు, మేడగం వెంకటేశ్వరరెడ్డి, పిడతల నేమిలయ్య, పుల్లలచెరువు సత్యనారాయణ, కనకం శ్రీను, కమిటీ చైర్మన్ అనూషతో పాటు నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.



