పర్చూరు, అక్టోబర్ 7:– పర్చూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమిచ్చేలా ఈనెల 8న రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కోట్లాది రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.
మంత్రి, ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో పర్చూరు మండల టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యంపై సమావేశంలో చర్చించారు. నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
మండల టీడీపీ అధ్యక్షుడు కొల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యటనను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. నియోజకవర్గంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి కార్యక్రమంలో పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని అన్నారు.Bapatla District News
రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు షేక్ శంషుద్దీన్, కోడూరి శేషా బ్రహ్మచారి మాట్లాడుతూ పర్చూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈనెల 8న జరిగే మంత్రి, ఎమ్మెల్యే పర్యటనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
సమావేశంలో పోపూరి శీను, నరేంద్ర, కన్నెగంటి సాంబశివరావు, పుల్లల సుబ్బారావు, కాపు రవి, కొరిటాల సురేష్, మామిడిపాక హరి, సిరిగిరి శివనాగేశ్వరరావు, కే. లక్ష్మీబాబు, లక్కీపోగు సుమన్, గిరి, రామ్మోహన్, వట్టిముక్కల అబ్రహం, జూపూడి మార్కు, పున్నయ్య, నాగరాజు, కొండగంటి శివ, సిరిగిరి నాగేశ్వరరావు, సతీష్, ఎస్. సుబ్బారావు, శ్రీధర్, టీ. శ్రీనివాసరావు, కొమ్మలపాటి సురేష్, బి. ఆంజనేయులు, మండల ముస్లిం అధ్యక్షుడు ఖాజావలి, సమీర్, సాంబశివరావు, తలారి శివయ్య, మల్లాది సురేష్, మా భాష, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.



